Wednesday, 4 November 2026

టీచింగ్ లర్నింగ్ మెథడ్ తో మెరుగైన విద్య

టీచింగ్ లర్నింగ్ మెథడ్ తో మెరుగైన విద్య. నెరడిగొండ జనవరి5(జనంసాక్షి):
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించుటకు బోధనోపకరణాలను ఉపయోగించాలని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. గురువారం రోజున
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు జరుగుతున్న మండల స్థాయిటి ఎఫ్ఎల్ఎం,టి.యల్ యం.బోధనాభ్యసన సామగ్రి మేళాను మండల విద్యాధికారి భూమరెడ్డి ఆధ్వర్యంలో జడ్పీటీసీ ఎంపిలు హాజరై వీక్షించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు బోధనోపకరణాలు ఉపయోగించి బోధించడం ద్వారా విద్యార్థులు విషయాన్ని త్వరగా అవగాహన చేసుకోవడమే కాకుండ వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను పెంపొందించ వచ్చునని జిల్లా మండల స్థాయి పరిశీలికులు సూచించారు.బోధనాసామగ్రిని మండలంలోని పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తెలుగు ఆంగ్లం గణితం పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులు తయారు చేసిన
బోదనోపాకరలను ప్రదర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎంపీపీ ఎంఈఓ తోపాటు ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిఆర్టియు టి ఎస్ సంఘం సభ్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.