బెల్లంపల్లి, మే 29,( జనంసాక్షి )
తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. ఎస్సి, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల్లాలో వచ్చే విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సెట్ 2023 ఫలితాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు సంబంధిత వెబ్సైటులో ఫలితాలు చూసుకొని సీటు వచ్చిన విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లతో గురుకులంలో అడ్మిషన్ పొందాలని సూచించారు.
టీజీ సెట్ ఫలితాలు వెల్లడి.




