సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని రాయినిగూడెంలో గల సెవెన్ స్టార్ హోటల్ లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో భాగంగా హోటల్ కి వచ్చిన కస్టమర్లు అందరికీ సీనియర్ ఎన్టీఆర్ అమితంగా ఇష్టపడే వంటకాలను రుచి చూపించారు.వివిధ రకాల రుచికరమైన వంటకాలను కస్టమర్లు ఆస్వాదించారు.నేటి తరం వారికి తెలియని చాలా వంటకాలను అందించారు. జున్ను, తాటి ముంజల జ్యూస్, పూర్ణాలు, బజ్జీలు, నాటుకోడి పులుసు, మటన్ బిర్యానీ వంటి వెజ్ – నాన్ వెజ్ తో కూడిన వివిధ వంటకాలను అక్కడికి వచ్చిన కస్టమర్లకి అందించారు.ఈ సందర్బంగా పలువురు ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు.నట సార్వభౌమ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు ఎనలేని పేరు, కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చారని కొనియాడారు. తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర ఆయన సొంతమన్నారు. తెలుగు ప్రేక్షకుల మనసులో ఎన్టీఆర్ స్థానం చిరస్మరణీయమని అన్నారు. రాముడు, కృష్ణుడు, భీముడు, కర్ణుడు ఇలా పౌరాణిక పాత్రల్లో ఆయనని తప్ప వేరేవారినిఊహించలేమన్నారు.సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన చెరగని ముద్ర వేశారన్నారు
సెవెన్ స్టార్ హోటల్ లో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు




