Sunday, 8 November 2026

టీడీపీకి పరిమితి లేదు

– తెలుగు వాళ్లున్న ప్రతీచోట టీడీపీ ఉంటుంది
– టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌
హైదరాబాద్‌, నవంబర్‌24(జ‌నంసాక్షి) : టీడీపీకి పరిమితి లేదని, తెలుగు వాళ్ళు ఉన్న ప్రతిచోట టీడీపీ ఉంటుందని టీడీపీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ..  టీఆర్‌ఎస్‌ నాయకులకు ఓటమి  భయం పట్టుకుందన్నారు. బాబుకు తెలంగాణ ఏం పని అని అంటున్నారని, టీడీపీ ఏపీ, తెలంగాణలోనే కాదు అండమాన్‌ లో కూడా ఉందన్నారు. తెలుగు వాళ్ళు ఉన్న  ప్రతిచోట టీడీపీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఇబ్బంది పడినా టీడీపీ ఆదుకుంటుందని రావులు తెలిపారు. అలాంటిది బాబుకు ఇక్కడ ఏం పని అడగటం అజ్ఞానం కిందకు రాదా అని  రావుల విమర్శించారు. మహబూబ్‌ నగర్‌ లో కేసీఆర్‌ గెలిచింది టీడీపీ అండదండలతోనేనని అన్నారు. చంద్రబాబుకు ఇక్కడ పనేంటి అని ఎలా అడుగుతారు అని రావుల ప్రశ్నించారు. వైస్రాయ్‌ ¬టల్‌ లో మాతో పాటు ఆనాడు కేసీఆర్‌ కూడా ఉన్నారని, తెలంగాణకు, టీడీపీకి విడదీయరాని బంధం ఉందన్నారని రావులు అన్నారు. హైదరాబాద్‌ లోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టింది చంద్రబాబు హయాంలోనే అని ఆయన గుర్తుచేశారు. ప్రతిపక్షాల సభ సక్సెస్‌ అయితే టీఆర్‌ఎస్‌ ఓర్వలేకపోతుందన్నారు. వచ్చే ఎన్నికలు నాలుగు పార్టీల మహాకూటమి, నలుగురు కుటుంబ సభ్యుల పార్టీ మధ్య జరిగే ఎన్నికలు అని రావుల పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రచారంలో పాల్గొంటారని, మొదటి విడత 28, 29 తేదీల్లో బాబు తెలంగాణకు వస్తారని రావులు తెలిపారు.