టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన TNSF రాష్ట అధికార ప్రతినిది జమల్ పూర్ వంశీ కొండమల్లేపల్లి
జగన్ ముఖ్యమంత్రిలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారు – గోడలు దూకి, తలుపులు బద్దలుగొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బీసీ నేత అయిన అయ్యన్న, ఆయన కుమారుడిని అరెస్ట్ చేయడం దుర్మార్గం అయిన చర్య అని ఆయన అన్నారు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో. అయన మాట్లాడుతూ – జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అయ్యన్నకుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోంది – అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత మొదలు ఆయనపై 10కిపైగా కేసులు పెట్టి వేధిస్తున్నారు – చింతకాయల విజయ్‌పై కేసు విషయంలో సీఐడీ విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదు – పోలీసులు దొంగల్లా ఇళ్ల మీద పడి అరెస్టులు చేస్తున్నారు – ఇలాంటి పరిస్థితులు గతంలో ఉన్నాయా? – వైసీపీ ఉత్తరాంధ్ర దోపిడీని ప్రశ్నిస్తున్న బీసీ నేతల గళాన్ని అణచివేసేందుకే కేసులు, అరెస్టులు చేస్తున్నారు – అయ్యన్న, ఆయన కుమారుడు రాజేశ్‌లను వెంటనే విడుదల చేయాలి కోరారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు