Friday, 6 November 2026

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు
పెద్దవంగర నవంబర్ 20(జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నివాసంలో కలిసిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఆదివారం పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ హమ్యా నాయక్ రాపాక సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆరు మండల పార్టీ అధ్యక్షులు తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నివాసంలో ని కలిసి పుష్పగుచ్చ నిచ్చి శుభాకాంక్షలు తెలుపారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంకు సమర్థవంతమైన అభ్యర్థిని పంపించి కాంగ్రెస్ పునర్వైభవం కోసం కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్ పట్ల అభిమానంతో ఉత్సాహంగా ఉన్నారని వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమర్థవంతమైన నాయకుడిని పంపించి ఎర్రబెల్లి దయాకర్ రావు నుంచీ విముక్తి కల్పిస్తా నాని హామీ ఇచ్చారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా మంత్రిగా పదవుల్లో ఉన్నప్పటికీ బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన వ్యతిరేక భావంతోనే ఉంటున్నాడని తెలుస్తుందన్నారు.అతను పై ఉన్న వ్యతిరేకతను మనం వినియోగించుకోవాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని నింపే రాబోయే రోజుల్లో పార్టీ పునర్ వైభవం కోసం కృషి చేయాలని సూచించారు.రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందని అధికారములోకి రావడం ఖాయమన్నారు.దానికి అందరం కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలని సూచించారు.కలిసిన వారిలో పెద్దవంగర మండల పార్టీ అధ్యక్షులు ముద్దసాని సురేష్ తొర్రూరు మండల పార్టీ అధ్యక్షులు జక్కుల రామ్ రెడ్డి రాయపర్తి మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల ప్రభాకర్. కొడకండ్ల మండల పార్టీ అధ్యక్షుడు సురేష్ నాయక్ దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షుడు పెద్ద కృష్ణమూర్తి,పాలకుర్తి మండల పార్టీ గిరి గాని కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.