ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచాలి
వేమనపల్లి,నవంబర్ 20,(జనంసాక్షి)
నేషనల్ హెల్త్ మిషన్ స్కీం లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలల్లో పనిచేస్తున్న కాంటిజెంట్ వర్కర్స్ వేతనాలు15,600/-రూపాయలు ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ఎన్.హెచ్.ఎం. అధ్యక్షులు నరసింహ,ఎన్.హెచ్.ఎం.రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రామా రాజేష్ ఖన్నా,రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ దేవనబోయిన బాపు యాదవ్ ఢిమాండ్ చేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంటిజెంట్ వర్కర్స్ పని చేస్తున్న వారికి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు 15,600/-చెల్లించాలని అన్నారు.నేషనల్ హెల్త్ మిషన్ అధికారులు,కమీషనర్ వెంటనే చొరవ తీసుకొని జీతాలు పెంచాలని లేనియెడల డిసెంబర్ 5న భారీ సమూహంతో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు




