టీయూడబ్ల్యూజే జహీరాబాద్ అధ్యక్షులుగా ఎండి మిన్హాజ్
జహీరాబాద్ జనవరి 7 (జనంసాక్షి) టియూడబ్ల్యూజె సమావేశం శనివారం స్థానిక అతిథి హోటల్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ కార్యవర్గానికి ఎన్నుకున్నారు.. అధ్యక్షులుగా ఎండి మిన్హాజ్ , ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డి లను ఎన్నుకోవడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా ఎండి అయుబ్ ను ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి ఫైసల్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి, విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు అనిల్, ప్రధాన కార్యదర్శి అసిఫ్, జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ హాజీ అలీ , కోశాధికారి మసూద్ ఖాన్ తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ మండలాల నాయకులు పాల్గొన్నారు.




