Wednesday, 4 November 2026

టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి అస్లం కు లైన్స్ క్లబ్ ఘన సన్మానం

టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి అస్లం కు లైన్స్ క్లబ్ ఘన సన్మానం

జూట్ సంచులు, నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన అస్లం..

ఉచిత వితరణ కార్యక్రమం నిరంతరం కొనసాగించేందుకు దాతలు ముందుకు రావాలి

మిర్యాలగూడ, జనం సాక్షి డిసెంబర్ 29

తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ_H) నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మహమ్మద్ అస్లం ఎన్నికైన సందర్భంగా గురువారం లైన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ మా శెట్టి శ్రీనివాస్ (డైమండ్) ఆధ్వర్యంలో ముఖపాటి వెంకటేశ్వరరావు దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యోగ
ప్రధాన కార్యదర్శి కోలా సైదులు ముదిరాజ్, రిటైర్డ్ డిప్యూటీ డీఈవో మురహరి, ఏచూరి భాగ్యలక్ష్మి,
లైన్స్ క్లబ్ బాధ్యులతో కలిసి
శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. గురువారం ఏరియా ఆసుపత్రిలో నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమంలో మీల్స్ ఇన్ వీల్స్ 51 రోజుకు చేరుకుంది. అస్లాం కు మెమొంటో అందజేసి సత్కరించారు. ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వం నిషేధించడంతో లైన్స్ క్లబ్ బాధ్యుల ఆదేశాలతో జూట్ సంచులను, నూతన సంవత్సర క్యాలెండర్ 2023, టియుడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా ప్రధాన కార్యదర్శి అస్లం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అస్లాం మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిలో నిత్య ఉచిత అల్పాహార కేకు వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రీజియన్ చైర్మన్ మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగించేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది నేతి సత్యనారాయణ, కంచర్ల అనంతరెడ్డి,లయన్ బి. ఎం. నాయుడు, దాతలుగా జూలకంటి వెంకట్ రెడ్డి కవిత దంపతులు, హరిత సునీల్ దంపతులు సింగపూర్ ముందుకు వచ్చి వితరణ కార్యక్రమం నిర్వహించారు.
టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర నాయకులు మల్లె నాగిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ రంగా శ్రీనివాస్, బొంగరాల మట్టయ్య, రాజారాం, రమేష్ నాయక్ తోపాటు, వాలంటరీలు రఫీ, బాబు, నాగేంద్ర తదితరు లు పాల్గొన్నారు