మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు మోడల్ స్కూల్ టీచర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు శంకర్ నాయక్,గురుచరణ్ ,అంబేద్కర్,శ్రీను,వేణు,సలీం ,లింగరాజు, వెంకటేశ్వర్లు,మల్లయ్య , వీరభద్రం,రాము తదితరులు పాల్గొన్నారు.




