Thursday, 5 November 2026

టెంకాయల దుకాణం అంటుకుంది..

hq8plmqnనెల్లూరు : జిల్లాలోని వెంకటగిరిలో ఉన్న టెంకాయల దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పోలేరమ్మ గుడి దగ్గర ఓ వ్యక్తి టెంకాయల దుకాణం నిర్వహిస్తున్నాడు. వచ్చే నెల ఆలయ జాతర జరుగుతుండడంతో దుకాణ యజమాని టెంకాయలు, కర్పూరం, నెయ్యి ఇతర సామాగ్రీని తెప్పించి దుకాణంలో నిల్వ చేశాడు. ఆదివారం రాత్రి అకస్మాత్తుగా దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణంలో ఉన్న సామాగ్రీ అంతా అగ్నికి ఆహుతైంది. ఈ విషయం తెలుసుకున్న యజమాని కన్నీరుమున్నీరయ్యాడు. పెద్ద నష్టమే జరిగిందని వాపోయాడు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *