ప్రమాద ఘటనపై తోటి ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్,జూలై2(జనం సాక్షి ): రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టెక్కీల ఇళ్లలో విషాదం అలముకుంది. వీరి శవాలకు పోస్ట్మార్టమ్ అనంతరం శావాలను బంధువులకు అప్పగించారు. టీసీఎస్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తు న్నవారు ప్రమాదానికి గురై, మృత్యువాతపడడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన స్థానికంగా వీరి మిత్రులను కలవరానికి గురిచేసింది. ఆరుగురు టీసీ ఎస్ కంపెనీకి చెందిన ఇంజనీర్లు విహారయాత్ర కోసం ఆదిలాబాద్ జిల్లా, నేరడిగొండ మండలం, కుంటాల జలపాతాన్నిసందర్శించేందుకు ఆదివారం వచ్చారు. తిరుగు ప్రయాణంలో నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి గ్రామ సవిూపంలో వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా (టీఏ 09 యూ 2 0052) వాహనం డి వైడర్‌ను ఢీకొని పల్టీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో మరొకరు నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. హైదరాబాద్ టీసీఎస్ కంపెనీలో వీరంతా సాప్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ, ఆదివారం సరదాగా గ డిపేందుకు కుంటాల జలపాత సందర్శనకు ఇన్నోవా వాహనంలో ఉదయం ఐదున్నర గంటలకు బయల్దేరారు. పదిన్నర గంటలకు అక్కడికి చేరుకుని, జలపాతాన్ని సందర్శించిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ సవిూపానికి చేరుకోగానే ఇన్నోవా టైరు పేలిపోవడంతో వాహనం డివైడర్‌ను ఢీకొని, పల్టీ లు కొట్టి, రోడ్డుపక్కన పడింది. ఈ ప్రమాదంలో వాహనాన్ని నడుపుతున్న సాప్ట్‌వేర్ ఉద్యోగి దినేష్ (27), కుసుమ (28) అక్కడికక్కడే మృతిచెందా రు. మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడడంతో వారిని హుటాహుటిన నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియాస్పత్రికి తరలించి చికిత్సలు జరిపారు. తీ వ్రంగా గాయపడినవారిలో యుగేంధర్, శ్రీవిద్య, నవీన్, నిఖిత ఉన్నారు. వీరికి అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం నిజామాబాద్‌కు త రలించారు. నిజామాబాద్‌లో చికిత్సపొందుతూ వీ రిలో శ్రీవిద్య మృతిచెందింది. ఎల్లపెల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదానికి అతి వేగంగా ఇన్నోవా వాహనం నడపడమే ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విహార యాత్ర కోసం హైదరాబాద్ నుంచి బయల్దేరి, కుంటాల జలపాతాన్ని సందర్శించి, తిరుగు ప్ర యాణంలో వారిని విధి వెక్కిరించడంతో ప్రాణాల ను బలిగొంది. జీవితంలో స్థిరపడి భవిష్యత్ అను భవించాల్సిన సాప్ట్‌వేర్ ఉద్యోగులు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందడం శోచనీయం. కాగా, మరో న లుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వారు ప్ర యాణిస్తున్న ఇన్నోవా వాహనం కండిషన్ సరిచూ సుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందంటున్నారు. ఎల్లపెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి ఇన్నోవా అతి వేగంగా నడపడమే కారణమని నిర్మల్ రూరల్ ఎస్‌ఐ రాజు తెలిపారు. వాహనంలో ప్రయాణిస్తున్నవారు హైదరాబాద్ టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్నారని వివరించారు. ఇద్దరు ఉద్యోగులు సంఘటనా స్థలంలో మృతిచెందగా, మి గిలిన నలుగురిని ఆసుపత్రిలో చేర్చించామన్నారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు నిర్మల్ రూరల్ ఎస్‌ఐ రాజు వివరించారు. ఇదిలావుండగా, నిజామాబాద్‌లో చికిత్సపొందుతూ శ్రీవిద్య ఆదివారం రాత్రి మృతిచెందింది.




