Wednesday, 4 November 2026

మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు – మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్

 

 

 

 

 

 

 

 

హుజూర్ నగర్ మే 10(జనం సాక్షి): మండలంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 257 మంది విద్యార్థులకు గాను 197 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, ప్రైవేటు పాఠశాలల్లో 321 మంది విద్యార్థులకు గాను 320 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, గురుకుల పాఠశాలలో 210 మంది విద్యార్థులకు 208 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9.7 జిపిఏ తో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు విద్యార్థి సిహెచ్ శరణ్య ఉత్తీర్ణత సాధించిందని, ప్రైవేటు పాఠశాలల్లో పదిమంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారని, గురుకుల పాఠశాలల్లో 9.8 జీపీఏ సాధించారని తెలిపారు. పదవ తరగతి పాసైన విద్యార్థులందరూ పై తరగతులలో ఇంకా మంచిగా రాణించాలని విద్యార్థులను కోరారు. ఉత్తీర్ణతకు కృషి చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.