టెస్టు క్రికెట్‌కు పాంటింగ్ గుడ్ బై
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న పెర్త్ టెస్ట్‌కు ముందే పాంటింగ్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 1995లో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన పాంటింగ్ ఇప్పటివరకూ 167 టెస్టు మ్యాచ్‌లు ఆడి 13,336 పరుగులు చేశాడు. పుర్త్ టెస్టు ఆడితే ఆస్ట్రేలియా తరపున అత్యధిక టెస్టులు (168) ఆడిన స్టీప్వా రికార్డును సమం చేస్తాడు.



