బాధిత కుటుంబానికి 2.0 లక్షల ఎల్ ఓ సి అందజేసిన మంత్రి నిరంజన్ రెడ్డి
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (23): మండల కేంద్రానికి చెందిన యాప చెట్టు చిన్న చంద్ర రాయుడు అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు వైద్య ఖర్చులకోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు ఈ విషయాన్ని మండల మహిళా కమిటీ ఉపాధ్యక్షులు కర్రోళ్ల స్వప్న భాస్కర్ లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సీఎం సహాయం నిధి ద్వారా రూ.2.0 లక్షల రూపాయలు మంజూరు చేయించి అందుకు సంబంధించిన ఎల్ ఓ సి ని శుక్రవారం హైదరాబాదులో మంత్రి చేతుల మీదుగా బాధితుడి కుమారుడు ప్రకాష్ కు అందజేశారు.




