టేకులపల్లి ఎంపీడీవో, ఎంపీ ఓ లకు ఉత్తమ సేవా అవార్డు
టేకులపల్లి, జనవరి 7( జనం సాక్షి): టేకులపల్లి మండలం పరిషత్ అభివృద్ధి అధికారి దుద్దుకూరు బాలరాజు, ఎంపీ ఓ జక్కుల గణేష్ గాంధీ లకు శనివారం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ చేతులు మీదుగా భారత రాష్ట్రపతి పర్యటన, ముక్కోటి ఉత్సవాలు విజయవంతం చేసిన సందర్బంగా ఉత్తమ సేవా అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా టేకులపల్లి మండలంలోని పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.




