Wednesday, 4 November 2026

హోరాహోరీగా సాగిన ఖిజర్ యఫై గోల్డ్ కప్ పోటీలు

హోరాహోరీగా సాగిన ఖిజర్ యఫై గోల్డ్ కప్ పోటీలు
జహీరాబాద్ జనవరి 7( జనం సాక్షి). పట్టణంలోని భాగ రెడ్డి క్రీడా మైదానంలో శనివారం ఖిజర్ యఫై గోల్డ్ కప్ లీగ్ పోటీల్లో భాగంగా రెండు మ్యాచులు జరిగయి, గ్రీన్ సిటీ క్లబ్ అచ్చంపేట మరియు రాయల్ కర్స్ సీసీ జట్ల మధ్య జరిగిన పోటీలో రాయల్ కార్స్ సీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తూ 19.2 ఓవర్లలో 126 పరుగులకు అలౌట్ అవ్వడంతో 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్రీన్ సిటీ సీసీ 18.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టనికి 130 పరుగులు చేయడంతో 2 వికెట్ల తేడాతో అచ్చంపేట ఘన విజయం సాధించింది, అచ్చంపేట అల్ రౌండర్ రిషికేశ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది, రెండవ పోటీలో ఎస్ కె సీసీ షోలపూర్ మరియు గజనన్ సీసీ మధ్య జరిగిన పోటీలో గజనన్ సీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ చేపడుతూ 19.4 ఓవర్లలో 140 పరుగులకు అలౌట్ అవ్వడంతో 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ కె షోలపూర్ సీసీ 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టనికి 141 పరుగులు చేయడంతో 6 వికెట్ల తేడాతో షోలపూర్ సీసీ ఘన విజయం సాధించింది, ఈ సందర్భంగా ముఖ్య అతిధి పాల్గొన్న ఖిజర్ యఫై బి ఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతూ అంకితభావంతో ముందుకు వెళ్ళినట్టైతే రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద వేదికల మీద ఆడే అవకాశం ఉందని, క్రీడాకారులు ఆటలో తమ తమ జట్ల తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలని, క్రిడ మైదానంలో రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి ప్రదర్శనలు మరిన్ని కనబర్చలని బిఆర్ఎస్ నాయకులు ఖిజర్ యఫై అన్నారు. కార్యక్రమంలో బిలాల్ పూర్ సర్పంచ్ నర్సింలు, మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్ గుప్త, మాజీ కౌన్సిలర్ రంగ అరుణ్ కుమార్, మల్చేల్మా ఎంపిటిసి మొహమ్మద్ ఇస్మాయిల్, బి ఆర్ ఎస్ నాయకులు మర్రి బాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మొహమ్మద్ మాక్సుద్, మర్రి బాల్ రెడ్డి, సద్దమ్ కుసంగి, తజోద్దీన్ శేకపూర్, ఇస్మాయిల్ శేకపూర్, అదం యఫై, అబుద్ యఫై, పబ్బతి సంతోష్, తయ్యబ్ అలీ, మద్ద రామి రెడ్డి, అబ్దుల్ మతిన్, ఆర్గనైజర్లు మాక్సుద్ అలీ, ఖాజా పటేల్, బాబాన్, అమనుల్లా ఖాన్, అజ్మత్ అలీ, మొహమ్మద్ సాజిద్, అసద్ యఫై, శ్రీనివాస్ ముదిరాజ్, మొహమ్మద్ సలీమ్, ఆర్షద్ ఖాన్, ఆసీఫ్ పటేల్, ఇబ్రహీం, నాయకులు, అభిమానులు, ప్రేక్షకులు పాల్గొన్నారు…