టేకులపల్లి మండలంలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు
టేకులపల్లి,నవంబర్ 14( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలో నవంబర్ 14న జవహర్ లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. టేకులపల్లి లోని గ్రావిటీ ప్రీమియర్ పాఠశాల, ప్రాథమిక పాఠశాల, బొమ్మనపల్లి, సులానగర్, ముత్యాలంపాడు, కోయగూడెం, బోడు, గంగారం, 9వ మైలు తండా, బేతంపూడి పలు పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులతోపాటు ఎంఈఓ రామ్ సింగ్ ఠాకూర్, టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆన్తోటి వెంకటేశ్వరరావు, ఎంపీడీవో దుద్దుకూరి బాలరాజు ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులై విద్యార్థులకు పాఠాలు బోధించినారు. తదనంతరం సమావేశమును ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.




