టేకులపల్లి మండలంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
* విద్యుత్ కాంతులతో విరజల్లుతున్న సులానగర్ ఆర్.సి.యం చర్చి
* అర్ధరాత్రి నుండి ప్రత్యేక ప్రార్థనలు
టేకులపల్లి, డిసెంబర్ 25( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలో అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులతో మిరిమిట్లు గొలిపే విధంగా చర్చిలను ఎంతో గ్రాండ్ గా అలంకరణలు చేసి శనివారం అర్ధరాత్రి నుండి చర్చిలలో క్రైస్తవులు కుటుంబాల సమేతంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన క్రిస్మస్ పండుగను ప్రతి ఇంటిలో ఎంతో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. రకరకాల పిండి వంటలతో, ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలను ధరించి ప్రత్యేక ప్రార్థనలతో పాటు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ క్రిస్మస్ వేడుకలను మండల వ్యాప్తంగా జరుపుకున్నారు. ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరి ప్రియ నాయక్ పలు చర్చిలలో పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య కోయగూడెం ఆర్.సి.యం చర్చిలో క్రిస్మస్ కేకులు కట్ చేశారు. సులానగర్ ఆర్.సి.యం చర్చిలో ఫాదర్ అగస్టీన్, కమిటీ సభ్యులు కేక్ కట్ చేసివేడుకలు జరుపుకున్నారు. సులానగర్ ఆర్ సి ఎం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రెవరెండ్ ఫాదర్ తుంపాటి ఆగస్తిన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిల్లలు క్రిస్మస్ పాటలకు నుత్యాలతో అలరించారు, ఈ క్రిస్మస్ వేడుకల్లో ఆర్.సి.యం చర్చి సభ్యులు, ఉండేటి బసవయ్య, అంతోటి నాగేశ్వరరావు, ఉండేటి ప్రసాద్, ఉండేటి ఇర్మియ, ఉండేటి ధర్మరాజు, బల్లెం భిక్షం, బల్లెం సురేష్ ,చింతమల్ల వీరస్వామి, చింతమల్ల రాజు, క్రైస్తవులు పాల్గొన్నారు.




