తెలంగాణ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్….. మంచిర్యాల జిల్లా 2వ మహాసభ…
జిల్లా కేంద్రంలోని వారిత గార్డ్ న్స్ లో .ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది.
ముఖ్య అతిథిగా మచ్చా రంగయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్గొని ప్రసంగించారు…
మాజీ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9000/-రూపాయలు చేయాలని, ఈ ప్రభుత్వం వెంటనే ఈ పార్లమెంటు సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని లేకపోతే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో నిరవధిక సమ్మె జంతర్ మంతర్ లో నిర్వహించాలని పెన్షన్ పెరిగే వరకు ధర్నా కొనసాగించాలని దేశ వ్యాప్తంగా పెన్షనర్లను సిద్దం చేయాడం జరుగుతుంది. అలాగే కోల్ మైన్స్ 11 వ వేతన సవరణ కమిటీ వేసి ఇప్పటికీ రెండేండ్లు కావస్తునంది. కానీ వేతన సవరణపై గాని, పెన్షన్ పై గాని సరైన నిర్ణయం తీసుకోలేదు. కోల్ మైన్ పెన్షనర్ల కనీస పెన్షన్‌ను 15000/-రూపాయలు ఇవ్వాలని, వాళ్లకు కూడా ఆఫీసర్లకు ఇచ్చినట్లుగా రెండవ పెన్షన్ ఇవ్వాలని, గ్రాడ్యుటీ కూడా అధికారులకు ఇచ్చినట్లుగా ఇవ్వాలని,1-1-2017 నుండి అమలు చేయాలి. ఇంకా మెడికల్ స్కీం లో 25 లక్షల బెనిఫిట్స్ అధికారులకు ఇస్తున్నరు, కానీ 40 వేల రూపాయలు కట్టిన కూడా 8 లక్షల బెనిఫిట్ మాత్రమే ఇస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని కూడా తొలగించాలని కోరారు. ఇవాళ పెన్షన్ కి డిఏ ఇవ్వాలని, ఉచిత పెన్షన్స్ సౌకర్యం అందరికీ కల్పించాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకి మూడు సంవత్సరాలుగా కరువు భత్యం బాకీ పడి ఉందని, డిసెంబర్ దాటితే నాలుగు వాయిదాలు అవుతాయని, గత పి ఆర్ సి కి సంబంధించిన జీవోలు ఇప్పటికీ విడుదల చేయలేదు. మేము మళ్ళీ మళ్ళీ కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకని వెంటనే ప్రభుత్వం పెండింగ్ డిఏలు విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన డిఏ బకాయిలు దాదాపు లక్ష కోట్లు ఉన్నాయని, అవి కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు విడుదల చేయాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజెన్లకి రైళ్లల్లో రెండు మూడు సంవత్సరాలుగా రాయితీలను నిలిపివేసింది. వాటన్నింటిని పునరుద్ధరించాలని ఉద్యమం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం పార్లమెంట్లో పునరుద్ధరించలేమని చెప్తుంది. సీనియర్ సిటిజెన్లకు రాయితీలను వెంటనే పునరుద్ధరించాలని ఈ మహాసభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.
నాయకులు .కుమార స్వామి,S. వెంకట స్వామి,ఎస్ వి .నర్సంహారావు,.శంకరయ్య,కె ఎమ్మెస్ .రెడ్డి, హాన్మంతరెడ్డి,బుచ్చయ్య,బాబు,ముబారక్, .చక్రధర్‌రావు, పెన్షనర్స్ పాల్గొన్నారు.




