టేకులపల్లి, ఏప్రిల్ 10 (జనం సాక్షి): టేకులపల్లి మండలంలో సోమవారం ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సాయన్నపేట గ్రామానికి ఇల్లందు ఆర్ & బి రోడ్ నుండి రు.70 లక్షల అంచనా తో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, బోడు రోడ్డులో తుమ్మల చిలక స్టేజి నుండి తుమ్మల చిలక గ్రామం వరకు రు.1 కోటి70 లక్షల వ్యయంతో బీటి రోడ్డు నిర్మాణ పనులకు, చింతోని చిలక ఆర్&బి రోడ్డు నుండి పెద్ద తండా గ్రామం వరకు రు.1 కోటి రూపాయలతో బీటి రోడ్డు నిర్మాణ పనులకు, శంభుని గూడెం టి డబ్ల్యూ రోడ్డు నుంచి రాజు తండా మీదుగా గోప్య తండా వరకు రు.1 కోటి 60 రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే హరిప్రియ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. చింతొని చెలక గ్రామంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు కంభంపాటి చంద్రశేఖర రావు సహకారంతో ఏర్పాటుచేసిన చలివేంద్ర కేంద్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సంపత్ నగర్ గ్రామంలో, చింతోని చెలక గ్రామంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ పార్టీ దిమ్మెలపై పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు.
టేకులపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే – పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు




