జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని పన్నూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని సోమవారం స్థానిక సర్పంచ్ అల్లం పద్మ తిరుపతితో కలసి జెడ్పీటీసీ మ్యాధరవేణి శారద కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి భాస్కర్, ఎంపీటీసీ చిందం మహేష్, ఎంపీవో భాస్కర్, ఉపసర్పంచ్ ధామెర శ్రీనివాస్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి ఆకాష్, వార్డు సభ్యులు నాగుల రమాదేవి, కంటి వెలుగు డాక్టర్ హిమబిందు, సూపర్వైజర్ సిహెచ్. లక్ష్మి, ఏ ఎన్ ఎం లు జే. శారద, వై. రాజేశ్వరి, డాటా ఎంట్రీ కృష్ణ, అప్తాలిమిక్ ఆపరేటర్ కే.ప్రవలిక, ఆశా వర్కర్లు శిరీష, సుమలత,తులసి,స్వరూప, సునీత గ్రామస్థాయి అధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
పన్నూరులో కంటి వెలుగు వైద్య శిబిరం




