టేకులపల్లి మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా కడుదుల
టేకులపల్లి, జులై 10( జనం సాక్షి ) : టేకులపల్లి మండలంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు లక్కినేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విస్తృతంగా పర్యటిస్తూ గ్రామ శాఖ కమిటీలను ఎన్నిక జరుపుతున్నారు. ఈ క్రమంలో సోమవారం టేకులపల్లి గ్రామ శాఖ నూతన కమిటీని ఎన్నిక చేశారు. టేకులపల్లి గ్రామ శాఖ మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షునిగా కడుదుల వెంకట రామారావు ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కడుదుల రాము, ఉపాధ్యక్షుడు యాసం ప్రసాద్, సహాయ కార్యదర్శిగా తిరుచి ముత్తుస్వామి , గౌరవ అధ్యక్షులు కడుదుల వీరన్న, కోశాధికారి యాసం స్వామి,, ప్రచార కార్యదర్శి సామినేని సాయి తేజ నుఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లక్కినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలో మున్నూరు కాపులు ఏకం కావాలని తెలంగాణ రాష్ట్రంలో 28% వున్న మున్నూరు కాపులకు ప్రభుత్వ నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు అందడం లేదని, మన హక్కుల కోసం మనం కలిసికట్టుగా పోరాడుతూ మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాగినేని నర్సింహారావు, కలత్తూరు కంధస్వామి, నర్సింగ్ లక్షమయ్య, లక్కినేని రంగా, గంగారపు రమేష్ ,రామిశెట్టి వీరయ్య ,సంపటి వెంకటేశ్వర్లు, పాశం హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.