దొంగతనానికి పాల్పడిన దుండగుల రిమాండ్- సీసీ కెమెరాల సహాయంతో నిందితుల గుర్తింపు

 

 

 

 

 

భైంసా రూరల్ జూలై 10 జనం సాక్షి

నిర్మల్ జిల్లా బైoసా పట్టణం పురాణ బజార్లోని అబ్దుల్ ఇర్ఫన్ కిరాణా షాపు లో శనివారం గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి, షాప్ లో ఉన్న వస్తువులను చిందరవందరగా పడేసి, కౌంటర్లో ఉంచిన 40 వేల రూపాయలను దొంగలించినారని కిరాణా షాప్ యజమాని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా…ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తును వేగవంతం చేసి, పోలీసులు చాకచక్యంగా
వ్యవరించి సిసి కెమెరాల ద్వారా విచారణ జరిపి నిందితులు అదే ప్రాంతానికి చెందిన షేక్ అద్నాన్, సయ్యద్ సోహెబ్, షేక్ మెహ్రాజ్, సయ్యద్ సల్మాన్, మరియు షేక్ సల్మాన్ లని గుర్తించారు. సోమవారం అరెస్టు చేసి విచారించగా వారు చేసిన నేరం ఒప్పుకోన్నారు.వారి వద్ద నుండి దొంగిలించిన రూ. 38,600/- రికవరీ చేసి, నిందితులను రిమాండ్ కు తరలించారు.

తాజావార్తలు