Friday, 6 November 2026

డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమానికి చక్కని స్పందన

డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమానికి చక్కని స్పందన

జహీరాబాద్ డిసెంబర్ 28 (జనం సాక్షి) డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమానికి చక్కని స్పందన లభించింది. బుధవారం జహీరాబాద్ డిపో మేనేజర్ కార్యాలయంలో 12:00 గంటల నుండి 1:00 గంటల వరకూ, డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో,కోహిర్ నుండి కొహిర్ చౌరస్తా వరకూ బస్సు సౌకర్యం కల్పించాల్సిందిగా, కోహిర్ పాఠశాలలో పనిచేసే నలుగురు అధ్యాపకులు విజ్ఞప్తి చేశారు.
ఉదయం సమయంలో అల్లాదుర్గం నుండి గంగ్వార్ కు మరియు సాయంత్రం గాంగ్వార్ నుండి అల్లాదుర్గం వరకూ బస్సు ట్రిప్పులు ఏర్పాటు చేయాల్సిందిగా శివరామకృష్ణ, రాజు అనే ప్రయాణికులు కోరారు.ఉదయం 6:30 గంటలకు, జహీరాబాద్ నుండి నారాయణఖేడ్ కు బస్సు సౌకర్యం కల్పించాల్సిందిగా మాణిక్యం అనే ప్రయాణీకుడు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్థానిక డిపో మేనేజర్, రజని కృష్ణ మాట్లాడుతూ ప్రయాణికులు తెలిపిన విజ్ఞప్తుల పైన తగిన పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.