Monday, 2 November 2026

టేకులపల్లి లో వరల్డ్ నో టొబాకో డే అవగాహన ర్యాలీలు

టేకులపల్లి, మే 31( జనం సాక్షి ): ప్రతి సంవత్సరం మే నెల 31వ తేదీ ని వరల్డ్ నో టొబాకో డే (world no tobacco day ) గా ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ర్యాలీలు, ప్రజలకు అవగాహన సదస్సులు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకు ఉత్పత్తులను, గుట్కా పాన్ పరాగ్ సిగరెట్ చుట్టా బీడీల రూపంలో తీసుకోవడం వల్ల గొంతు, నోరు, ఊపిరితిత్తులు, ప్రేగు క్యాన్సర్లతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని, ఒక సిగరెట్టు తాగడం వల్ల 12 నిమిషాల జీవితకాలం తగ్గిపోతుందని, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం 9 లక్షల మందికి వివిధ రకాలైన ఊపిరితిత్తుల వ్యాధులు సోకుతున్నాయి అని, ఐదు లక్షల మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని,దగ్గర దగ్గరగా 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ సందర్భంగా వైద్య అధికారి పేర్కొన్నారు. అందువలన ప్రజలందరూ పొగాకు ఉత్పత్తులను తీసుకోవడం మానేయాలని, తల్లిదండ్రుల ద్వారా దేవుడు ప్రసాదించిన చక్కటి ఆరోగ్యాన్ని జీవితాంతం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. జరిగిన అవగాహన ర్యాలీలు, సదస్సుల్లో స్థానిక సర్పంచులు, కార్యదర్శులతో పాటు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ, పబ్లిక్ హెల్త్ నర్సు సత్యవతి, సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్,నాగు బండి వెంకటేశ్వర్లు, వీసం శకుంతల, గుజ్జ విజయ, పల్లె దవాఖాన వైద్యులు ధరణి, అమూల్య, ఇంద్రజ, హారిక, భార్గవి, శైలజ, నిఖిత, ఏఎన్ఎంలు నాగలక్ష్మి, ఫాతిమా, ఎల్లమ్మ, సైదమ్మ, కమల, రమాకుమారి, లలిత, కళావతి, మానస,పరంగిణి, సుజాత, స్వప్న,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.