టైటాన్ భాగస్వామ్యం తో సెర్రుటీ 1881 వారి లగ్జరీ వాచీలు భారతదేశం లో విడుదల
కంటోన్మెంట్ జనం సాక్షి ఆగస్టు 25 హైదరాబాద్ సమయం చూడటానికే వాచీలు ఉండాలి అనే ప్రస్తావన ఎప్పుడో పోయింది.సరికొత్త డిజైన్లలో, టెక్నాలజీని ఆధారం చేసుకుని వస్తున్న వాచీలు ఇప్పుడు నయా ట్రెండుగామారాయి. మనుషుల అభినయానికి, స్టేటస్ కు అవి ప్రతీకగా నిలుస్తున్నాయి.ఈ లగ్జరీ ప్రపంచంలో వాచీలదే హవా అనడంలో కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.ఈ నేపథ్యంలో అతివలను, పురుషులకు తమ నయా వాచ్ తో మరింత సొగసులు అందించేందుకు సిద్ధమైంది ప్యారిస్ కు చెందిన ఫ్యాషన్ లగ్జరీ సంస్థ సెర్రుటి 1881. దిగ్గజ సంస్థ టైటాన్ కంపెనీ లిమిటెడ్ తో కలిసి భారత్ లో తమ వాచీలను విడుదల చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. క్వాలిటీలో ఏ మాత్రం తీసిపోని సెర్రుటి వాచీలు సెలబ్రిటీలకు,ఫ్యాష నిస్టులకు వాచీల ఎంపికలో ముందు వరుసలో ఉంటాయి. సామాన్యులకూ అతి ప్రియమైనవిగా సెర్రుటి వాచీలు నిలుస్తున్నాయి అనడంలో సందేహం అక్కర్లేదు.మహిళలు, పురుషుల కోసం స్టైలిష్ వాచీలను డిజైన్ చేయడంతో పాటు హై ష్యాషన్ బేసువల్డ్, కాంటెంపరరీ వర్క్ వేర్, డ్రెస్-స్పోర్ట్ స్టైల్ వంటి సరికొత్త డిజైన్ లతో నిండిన ఈ బ్రాండ్ వాచీలను ప్యారిస్ లో రూపొందించారు.316 ఎల్ సర్జికల్ స్టెయిన్ లెస్ స్టీల్, సఫాయి కోటెడ్ గ్లాస్, స్వారోస్కి క్రిస్టల్స్, టాప్ అండ్ ఫినిషింగ్ ఇంకా పీవీడీ కోటింగ్ మేక్ వంటి ప్రీమియమ్ క్వాలిటీ మెటీరియల్ తో వినియోగదారులు నచ్చిన క్వాలిటీని ఎంచుకునే విధంగా వీటిని రూపొందించారు .సెర్రుటి 881 మాల్వినో (సి 1డబ్ల్యూ జి 12207403) క్రోనోగ్రఫీ వాచ్ అనేది గడియారాలను ఇష్టపడే పురుషు లందరికీ తప్పనిసరిగా ఉండాల్సిన టైమ్ పీస్. జపనీస్ మూమెంట్ సెంటర్ క్రోనోగ్రఫీ హ్యాండ్, 24 గంటల టైమ్ డిస్ ప్లే, బిగ్ డేటా ఫంక్షన్ వంటి ఫీచర్లను ఈ వాచీలో జతపరిచింది. సెర్రుటి 1881 రెండినరా ( సిఆర్ఎం 35501) మహిళలకు ఉపయోగపడే వివరాలు తెలిపే సరికొత్త ఫీచర్లను కలిగి ఉంది.సెర్రుటి 1881 వాచీ బ్రాండ్ భారత్ లోని దిల్లీ, హైదరాబాద్, ముంబయి వంటి ప్రముఖ మెట్రో పాలిటన్ నగరాలలో అందుబాటులో ఉంటుంది.ఈ బ్రాండ్ లో వివిధ వాచీల ధర రూ. 20,000 నుంచి రూ. 45,000 మధ్యఉంటుంది. హెలియస్, టైటాన్ వరల్డ్ రిటైల్స్, షాపర్స్ స్టాప్, లైఫ్ స్టైల్ వంటి బహుళ డిపార్ట్మెంట్ స్టోర్లలో కూడా ఈ వాచీలు లభించనున్నాయి.ప్రతిష్ఠాత్మక వాచ్ కేంద్రాలు, ప్రీమియం టాటా క్లిక్ వంటి ఆన్లైన్ఫ్లాట్ఫార్మ్లోలభిస్తాయి నిర్వాహకులు తెలియజేశారు.