టోల్‌ట్యాక్స్‌ రద్దు..!!

lekki-toll-gate-1పెద్ద నోట్ల ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం (ఎల్లుండి) అర్ధరాత్రి వరకు టోల్‌ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. రూ. 500, 1000ల నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడంతో కేంద్రం ఈ మేరకు కొత్త నిర్ణయం తీసుకుంది. నిన్న అర్ధరాత్రి కేంద్రం నిర్ణయం ప్రకటించిన తర్వాత టోల్ గేట్ల వద్ద గొడవలు జరిగాయి. కిలోమీటర్ల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తొలుత రూ. 500, 1000 నోట్లు తీసుకోవాలని చెప్పిన కేంద్రం ఆ తరువాత టోల్ ట్యాక్స్‌ను రెండు రోజులపాటు పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.