ట్రస్మా మోత్కూర్ మండల అధ్యక్షుడు గా మలిపెద్ది రాజిరెడ్డిట్రస్మా మోత్కూర్ మండల అధ్యక్షుడు గా మలిపెద్ది రాజిరెడ్డి
మోత్కూరు నవంబర్ 25 జనంసాక్షి : ట్రస్మా మోత్కూర్ మండల అధ్యక్షుడు గా అక్షర హైస్కూల్ ప్రిన్సిపాల్ మలిపెద్ది రాజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రస్మా మోత్కూర్ మండల సమావేశం గురువారం శ్రీసాయి చైతన్య హైస్కూల్ లో జిల్లా అధ్యక్షుడు పగడాల జలంధర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ట్రస్మా రాష్ట్ర కోశాధికారి డాక్టర్ రఘు వెంకటసురేష్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ ఎన్నిక నిర్వహించారు. మండల గౌరవ అధ్యక్షునిగా పంజాల నర్సయ్య శ్రీ సరస్వతి విద్యాలయం ఆత్మకూరు, ప్రధాన కార్యదర్శిగా ప్రతికంఠం శంతన్ రాజ్ బ్రిలియంట్ స్కూల్ ఆత్మకూరు, కోశాధికారిగా ఎం. రంగయ్య లక్ష్మీ సరస్వతి స్కూల్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా గౌరవ అధ్యక్షుడు గాదె సోమిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల దుర్గాప్రసాద్, కోశాధికారి నోముల బస్వారెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు గాద సోమిరెడ్డి, జిల్లా సహధ్యక్షులు పాలకూర వెంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శి సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నాయకులు శేఖర్ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్రస్మా మోత్కూర్ మండల అధ్యక్షుడు గా మలిపెద్ది రాజిరెడ్డిట్రస్మా




