వార్డుల మౌలిక వసతుల కల్పనకు కృషి – మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి హుజూర్ నగర్ నవంబర్ 25(జనంసాక్షి): హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 27వ వార్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ. 5 లక్షల వ్యయంతో సి సి రోడ్డు పనులు వార్డు కౌన్సిలర్ యరగని గురవయ్య గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధే ధ్యేయంగా పాలకవర్గం పనిచేస్తుందని, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ యరగాని శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల మర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్, కౌన్సిలర్లు అమరబోయిన సతీష్, ములకలపల్లి రామ్ గోపి, కొమ్ము శ్రీను, గ్రంథాలయ చైర్మన్ పిన్నెని సంపత్ కుమార్, నాయకులు ఇలవల గోపీనాథ్ రెడ్డి, యరగాని సత్యనారాయణ గౌడ్, బెల్లంకొండ రమేష్, యరగాని ఉపేందర్, రవి, సోమగాని ప్రదీప్, సిద్దు, ప్రభుత్వ కళాశాల ప్రధానాచార్యులు భీమార్జున్ రెడ్డి, కాంట్రాక్టర్ వేముల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
వార్డుల మౌలిక వసతుల కల్పనకు కృషి – మున్సిపల్




