ట్రాన్స్ పోర్ట్ లారీల్లో స్థానికులకే అవకాశం కల్పించాలి
– భూనిర్వాసిత ప్రాంతాలకు ప్రాధాన్యం
– జీఎంలు చొరవ తీసుకోవాలి
– జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధు
యైటింక్లయిన్ కాలనీ జనవరి 07( జనంసాక్షి):
బొగ్గు ట్రాన్స్ పోర్ట్ లారీల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధు సింగరేణి అధికారులను కోరారు. శనివారం ఆర్జీ-2 గౌతమి గెస్ట్ హౌజ్ లో ఆర్జీ రీజియన్ జీఎంలు, సింగరేణి అధికారులు, ఆర్డీవోతో సమావేశం నిర్వహించారు. భూసేకరణ సమయంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సింగరేణి యాజమాన్యం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. ట్రాన్స్ పోర్ట్ లారీల్లో స్థానికులకే అవకాశం కల్పించే విషయంలో జీఎంలే చొరవ తీస్కోవాలని, లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల వారి లారీలను మంథని ప్రాంతంలోకి అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు. ఈ విషయంగా సానుకూలంగా స్పందించిన సింగరేణి అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీస్కెల్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంథని ఆఅర్డీవో వీరబ్రహ్మ చారి, తహశీల్దార్ రామ్మోహన్, ఆర్జీ-2 జీఎం ఐత మనోహర్, ఆర్జీ-3 జీఎం తన్నీరు వెంకటేశ్వర్ రావ్, నాయకులు పూదరి సత్యనారాయణ గౌడ్, దాసరి రాయలింగు, కనవేన శ్రీనివాస్, బుర్ర ముత్యాలు, ఎస్టేట్ అధికారులు పాల్గొన్నారు.




