Monday, 2 November 2026

ట్రాఫిక్‌ నిబంధనలు ఇక కఠినతరం

హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి): నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు కఠినతరం చేయనున్నామని ట్రాఫిక్‌  పోలీసులు హెచ్చరించారు. హెల్మెట్‌  ధరించకపోవడం, మితివిూరిన వేగం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడం, మద్యం తాగి నడపడం వంటి సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు దాడులు ముమ్మరం చేయనున్నామన్నారు. నగరంలో డైనమిక్‌ దాడులు కొనసాగిస్తామని తెలిపారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించేవారికి పాయింట్లు కేటాయించి 12 పాయింట్లు దాటితే తాత్కాలికంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తామని, నిబంధనల అతిక్రమణ పునరావృతమైతే లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని ఇప్పటికే హెచ్చిరించారు. దీంతో దానికి అనుగుణంగా చర్యలకు ఉపక్రమించారు.