మన ఊరు మన బడి పనులను పరిశీలించిన జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (6): మండల పరిధిలోని బుద్ధారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న మన ఊరు మన బడి పనులను మంగళవారం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటరమణ పరిశీలించారు మన ఊరు మనబడి పనులను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని కావున పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఆయన సూచించారు అంతకుముందు గ్రామంలోని ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హుస్సేనప్ప, సర్పంచ్ చింతకుంట పద్మమ్మ, ఎంపీటీసీ విష్ణు, పంచాయతీ కార్యదర్శి రమేష్ నాయుడు, తదితరులు ఉన్నారు




