బోనగిరి టౌన్ జనం సాక్షి):–భువనగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ ఆధ్వర్యంలో బస్వాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఎన్నికను కార్యకర్తల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ శాఖ అధ్యక్షులుగా మచ్చ పాండు, ఉపాధ్యక్షులుగా కడారి చందు, ప్రధాన కార్యదర్శిగా ఉడుత కార్తీక్, కార్యదర్శిగా మోత్కుపల్లి యాదగిరి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కోర్ కమిటీ నాయకులు మాట్లాడుతూ గ్రామంలో పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని భువనగిరిలో కుంభ అనిల్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ నాయకులు చిక్కుల వెంకటేశం, ఎలిమినేటి కృష్ణారెడ్డి,గడ్డమీది వీరస్వామి, ఎల్లంల జంగయ్య,పాశం శివానంద్,వల్లందాసు ఆదినారాయణ, విఠల్ వెంకటేశ్ మరియు గ్రామ శాఖ మండల నాయకులు మచ్చా నర్సింహ ఉడుత నరసింహ మచ్చ నవీన్ మచ్చ శ్రీశైలం చిక్కుల పాండు చిక్కుల స్వామి నరాల రమేష్ రాసాల రాజు చుక్క ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.




