కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) ఏప్రిల్ 7 :-. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు పరచాలని ప్రజల సమస్యలు పరిష్కరిస్తాడని నమ్మకంతో మేడ్చల్ నియోజకవర్గం ప్రజలు మంత్రి మల్లారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్రానికి కార్మిక మంత్రి అయ్యే అవకాశాన్ని కల్పిస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి నేడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతు డంపింగ్ యార్డ్ యాజమాన్యానికి తొత్తుల వ్యవహరిస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి అనుసరిస్తున్న తీరును హరి వర్ధన్ రెడ్డి తప్పు పెట్టారు ఆదివారం దమ్మాయిగూడ డంపింగ్ యార్డ్ జేఏసీ ఆధ్వర్యంలో దమ్మాయిగూడలోని మున్సిపల్ కార్యాలయం నుండి జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు త్రీ కే వాక్ నిర్వహించారు.ఈ సందర్భంగా టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి దమ్మాయిగూడ, నాగారం, కీసర కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి ఈ కార్యక్రమంలో పాల్గొని జేఏసీ వారికి సంఘీభావం తెలియజేశారు. అనంతరం హరి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దమ్మాయీగూడ, జవహర్ నగర్, నాగారం, కీసర ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించాలనీ డంపింగ్ యార్డ్ తరలించేంతవరకు దుర్వాసన రాకుండా నీరు కలుషితం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలనీ ఎన్ జి టి ఇచ్చిన ముఖ్య ఆదేశాలను పాటించాలని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు నిత్యం 8 వేల వాహనాలతో చెత్తని తరలిస్తున్నారనీ దానిలోంచి ఏప్రిల్ 30 2023 లోపు 25% చెత్తను, 2 వేల వాహనాలు ఇక్కడ నుంచి దుండిగల్ కు వెళ్లిపోవాలనీ
లగ్డారం డంపింగ్ యార్డ్ కు 25% చెత్తను తరలించాలనీ వెంకటేశ్వర పవర్ ప్రాజెక్టు కోసం 25% చెత్తను తరలించాలని
మిగిలిన 25% చెత్తను ఇక్కడే పవర్ ప్లాంట్ కు వినియోగించి రీసైక్లింగ్ చేసి బయోమైనింగ్ ద్వారా ఎరువులను తయారు చేసి, మొదట ఎలా ఉందో అలాగే మిలటరీ ల్యాండ్ ను శుభ్రం చేసి చదును చేయాలనీ
జిహెచ్ఎంసి కమిషనర్ కూడా లిఖితపూర్వకంగా ఎన్ జి టి వారికి వారి ఆదేశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారని ,వాటిని ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదో అర్ధం కావడం లేదని అభ్యంతర పూర్వకమైన డిమాండ్లను వ్యక్తపరిచారు స్థానిక మంత్రి మల్లారెడ్డి చేతగాని తనం తో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారనీ
మున్సిపల్ శాఖ మంత్రి కే టీ ఆర్ ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలి డిమాండ్ చేశారు ఈ ఎన్జీటీ ఆదేశాలను తక్షణమే అమలు పరచాలని, ఇప్పటివరకు అమలుపరచనందుకు నిరసనగా డంపింగ్ యార్డ్ జేఏసీ వారు ఈరోజు త్రీ కే వాక్ నిర్వహించారని ,వారికి తన సంఘీభావం తెలియజేస్తున్నానని, కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున దీనిపై పోరాటాలకు పిలుపునిచ్చిందని, సుప్రీంకోర్టులో, ఎన్జీటీలో గౌరవ టిపిసిసి అధ్యక్షులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గతంలో కేసులు వేసి, డంపింగ్ యార్డ్ జేఏసీ వారి తరఫున తాను కొట్లాడానని, భవిష్యత్తులో కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ క్లీన్ అయ్యేంతవరకు ఎన్జీటీ ఆదేశాలను అమలుపరిచేంతవరకు జేఏసీ వారి పోరాటానికి తాను మద్దతు తెలుపుతానని, అండగా ఉంటానని పూర్తి మద్దతు ప్రకటించారు
ఈ త్రీ కే వాక్ లో జేఏసీ ప్రతినిధులకు సంఘీభావం తెలిపిన వారిలో హరి వర్ధన్ రెడ్డి తో పాటు దమ్మాయిగూడ, నాగారం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పా రామారావు, ముప్పు శ్రీనివాసరెడ్డి, నాయకులు ఏనుగు సంజీవరెడ్డి, నల్ల మధుసూదన్ రెడ్డి, శ్రీశైలం కురుమ, సుమేష్, శోభారాణి కృష్ణారావు, ఈగ శ్వేత రాజు, మెరుగు సునీత ,పరమేష్, నరిశెట్టి కిరణ్ కుమార్ ,గడ్డం శ్రీనివాస్, గజ్వేల్ శంకర్, నర్సింగ్ తదితరులు ఉన్నారు




