Tuesday, 3 November 2026

డంపింగ్ యార్డ్ ను తరలించండి.. ప్రజల ప్రాణాలను రక్షించండి – మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సేగ్గం రాజేష్

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డ్ ను జనావాహం లేని ప్రాంతానికి తరలించాలని మంథని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేగ్గం రాజేష్, కాంగ్రెస్ నాయకులు మంథని ఆర్డీవో కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంథని మున్సిపల్ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ మాతా శిశు ఆస్పత్రికి ముందు ఉండడం వలన ప్రసూతి సేవలు పొందుతున్న తల్లి బిడ్డలు దుర్వాసనతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందన్నారు. మంథనిలోని అలోక్ పబ్లిక్ స్కూల్, సూరయ్య పల్లెలోని మేరీ మీడియ హై స్కూల్ లకు దగ్గరలో డంప్ యార్డ్ ఉండడం విద్యార్థులు నిత్యం అనారోగ్యంతో ఇబ్బందులు ఉన్నారని అన్నారు. ఆర్ అండ్ బి రోడ్డు పక్కకు డంపింగ్ యార్డ్ ఉండడం వలన తీసుకువచ్చిన చెత్తను కాలబెట్టడంతో పొగ ఏర్పడి పొగ వలన దారి కనిపియ్యక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వాగు గడ్డ పక్కకు డంపింగ్ యార్డ్ ఉండడం వలన నీరు కూడా కలుషితం అవుతుందని అన్నారు. డంపింగ్ యార్డును వెంటనే జనావాహం లేని ప్రాంతానికి మార్చి ప్రజలు అనారోగ్య బారిన పడకుండా కాపాడాలని ఆర్డిఓ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముస్కుల సురేందర్ రెడ్డి , మంథని సత్యం, గోటికారి కిషన్ జీ, నూకల బానయ్య, జంజర్ల శేఖర్, తోకల మల్లేష్, పెంటరి రాజు, ఎరుకల ప్రవీణ్,మంథని రాకేష్, ఆర్ల నాగరాజు, దోన గోర్ల శ్రీనివాస్,దాసరి గట్టయ్యా, నాగుల రాజయ్య, కాశీపేట బాపు, కన్నురి బాపు, కన్నబోయిన ఓదెలు, అక్కపాక సదయ్య, ఊరగొండ గణేష్, ముజిబ్, చంద్రశేఖర్, కొయ్యల దేవేందర్,రితిష్, పెరుగు తేజ, గొల్లపెల్లి శ్రీనివాస్, ఏజజ్, పోయిల తిరుపతి, గువ్వల ప్రశాంత్, ఇందారపు అనిల్, అరెళ్ళి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.