కంటోన్మెంట్ జనం సాక్షి మే 02 బోయిన్ పల్లి బిఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ మరియు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజక వర్గ ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి స్థానిక బిఆర్ఎస్ పార్టీ నేతలతో కలసి బోయిన పల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే కంటోన్మెంట్ లో నీటి బకాయిలు మాఫీ చేసేందుకు సర్కారు సిద్ధంగా ఉందిఅన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ మరియు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో త్వరలో నే ఆ సమస్య పరిష్కారంఅవుతుంది అన్నితెలిపారు .కంటోన్మెంట్ బోర్డు కు సర్వీస్ చార్జీల కింద రావాల్సిన 800 కోట్లు విడుదల చేస్తే కంటోన్మెంట్ ను సింగపూర్ మాదిరిగా అభివృద్ధి చేయొచ్చు అన్నారు, అట్టి నిధుల సాధన కై మనం నిరంతరం కేంద్రం ప్రభుత్వాన్ని కి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం,కంటోన్మెంట్ ప్రాంతంలో అంతర్గతంగా మూసి ఉన్న రోడ్ల ను సైతం తెరిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ తోడుగా ఉంటుంది అన్నారు, అదే విధంగా ఎస్ఎన్ డిపి ద్వారా రామన్నకుంట,తిరుమలగిరి, హస్మత్ పేట్ పరిధిలోని నాలాల ఆధునీకరణ చేపట్టేందుకు సర్కారు చర్యలు తీసుకుంటుంది. దీంతో కంటోన్మెంట్ లోని పలు ప్రాంతాలు కాలనీలు,బస్తీలు ముంపునకు గురికాకుండా నివారించేందుకు పకడ్బందీగా ముందుకు సాగుతున్నాం అన్ని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి,దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్య నందిత, నివేదిత, బోర్డ్ మాజీ సభ్యులు పాండు యాదవ్,లోకనదం,భాగ్యశ్రీ,నళిని కిరణ్, ప్రభాకర్ మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, రాగిరి ఆనందబాబు గౌడ్, పెద్దల నర్సింహా,వార్డ్ 5 ప్రెసిడెంట్ కిరణ్,వార్డ్ 8 ప్రెసిడెంట్ తేజ్ పాల్,పిట్ల నగేష్, సదానంద, గంగారాం,శర్విన్,రాజు సింగ్, ప్రవీణ్ యాదవ్,సురేష్,శ్రీకాంత్, మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
నీటి బకాయిలు మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం మర్రి రాజశేఖర్ రెడ్డి




