మోత్కూరు మార్చి 3 జనంసాక్షి : మోత్కూర్ మండలం రాగిబావి గ్రామంలో ప్రజల అవసరాల దృష్ట్యా రక్షిత త్రాగు నీరు అందించే ఉద్దేశంతో సుమారు రెండు లక్షల ముప్పై వేల రూపాయల విలువైన నీటి శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసిన ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు శ్రీకాంత్ రాజు. ఈ సందర్బంగా రాగిబావి గ్రామంలో నీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడోజు వాణి శ్రీకాంత్ రాజు తో పాటు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి లు హాజరై కొబ్బరికాయ కొట్టి నూతన నీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో స్థానిక సర్పంచ్ రాంపాక నాగయ్య మాట్లాడుతూ సేవే లక్ష్యంగా ప్రాంతీయ కుల మతాలకు అతీతంగా నిస్వార్థంగా సేవలు చేస్తున్న చైర్మన్ కు గ్రామంలో నీటి శుద్ధి యంత్రం కావాలని అడిగిన వెంటనే ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఆరాధ్య ఫౌండేషన్ సేవలను అభినందించారు. ఫౌండేషన్ పేద ప్రజల పక్షాన నిరంతరం పనిచేస్తుందన్నారు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు దంపతులు. ఈ సందర్బంగా వీరిని శాలువాలతో సన్మానించిన గ్రామ పంచాయతీ పాలక వర్గం. ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ మండల ఇంఛార్జి కాపర్తి సైమన్, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్.ఎన్.చారి, వేలిమినేటి జహంగీర్,గనగని నర్సింహ, దబ్బెటి సొంబబు,వీరితో పాటు కురిమెటి యాదయ్య,మమిడాల సర్పంచ్ కరుణాకర్,వేంకటచారి, బుంగపట్ల యకయ్య,మాజి ఎంపీటీసీ పానుగల్ల విష్ణు, ఫౌండేషన్ గ్రామ ఇంఛార్జి రాంపక కృష్ణ,వార్డు సభ్యులు,గ్రామస్తులు,ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించిన ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు




