మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్12.
శాంతిభద్రతల బాగుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మల్కాజిగిరి,నేరెడ్ మెట్ పోలీసులు ఏర్పాటుచేసిన 2k రన్ ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జండా ఊపి ప్రారంభించారు.మల్కాజిగిరి చౌరస్తా నుండి సఫిల్ గూడ చౌరస్తా వరకు రెండు కిలోమీటర్లు రన్ నిర్వహించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్టమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలతో మమేకమై పనిచేసేలా ఫ్రెండ్లీ పోలీస్ గా మార్చారని దీంతో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు.నేర నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.అనంతరం ఎస్పీ నగర్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రాజు,సిఐ రవికుమార్,నాగరాజు,ట్రాఫిక్ సిఐ సుధీర్ కృష్ణ,కార్పొరేటర్లు,సునీత యాదవ్,
రాజ్యలక్ష్మి,ప్రేమ్ కుమార్,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,ఉపేందర్ రెడ్డి, పిట్ల శ్రీనివాస్,సంతోష్ రాందాస్,రాము యాదవ్,సతీష్ కుమార్, చెన్నారెడ్డి,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం.




