డబుల్‌ బెడ్‌రూంలకు రూ.600 కోట్ల విడుదల

హైదరాబాద్‌,నవంబరు 5 (జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ.600 కోట్లను విడుదల చేస్తూ గృహనిర్మాణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3,750 కోట్లను కేటాయించింది. ఇందులో భాగంగా గతంలో రూ.150 కోట్లు విడుదల చేయగా.. తాజాగా మరో రూ.600కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.