Tuesday, 3 November 2026

డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదని..ఆత్మ హత్య యత్నం…!

మిర్యాలగూడ, జనం సాక్షి.
డబుల్ బెడ్రూం ఇల్లు తనకు రాలేదని అవేదన కు గురైన  నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 29వ వార్డుకు చెందిన పల్లపు భాగ్యలక్ష్మీ కొంత మంది  బాధితులతో కలిసి శనివారం ఆర్డిఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మీ ఒంటిపై పెట్రోల్ పోసుకొనిఆత్మహత్యాయత్నానికి  పాల్పడిందని స్థానికులు పేర్కొన్నారు. అప్రమత్తమైన పోలీసులు ఆమె వద్ద నుంచి పెట్రోల్ బాటిల్  తీసుకున్నారు.  పోలీస్ వాహనంలో ఆమెను ఇంటికి తరలించారు.