భువనగిరి టౌన్ (జనం సాక్షి):—
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు కరుణం పద్మ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రం లోని స్థానిక బాబు జగజ్జీవన్ రావ్ చౌరస్తా వద్ద గ్యాస్ సిలిండర్ కు పూల తో శ్రద్దాంజలి గటించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా యాదాద్రి జిల్లా అధ్యక్షులు అతహర్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా వంట గ్యాస్ ధరలను పెంచడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇళ్ల లో వాడే గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు కమర్శియల్ సిలిండర్ పై 350 రూపాయలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రలలో ఎన్నికలు ముగియగానే సిలిండర్ ధరలు పెంచి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులను ప్రజల నుండి లాక్కునే భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.నరేంద్ర మోడీ సమాన్య ప్రజలను దోచుకుని ఆధాని, అంబాని లాంటి కార్పొరేట్ లకు కట్టబెడుతున్నాడని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వానికి సామాన్య ప్రజల పై చిత్తశుద్ధి ఉంటే వెంటనే గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని లేనియెడల నరేద్ర మోడీ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యాక్షులు సుర్వి వెంకటేష్ గౌడ్, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షకీల్, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు వాహేద్, మైనారిటీ కార్యదర్శి సోహైల్, యూత్ కార్యదర్శి రాకేష్,పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు అనిల్, నాయకులు రమేష్, రఘు, ఉమర్, వసీమ్ తదితరులు పాల్గొన్నారు.
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో నిరసన




