మెట్ పల్లి లో దొంగల బీభత్సం, పన్నెండు దుకాణాలలో చోరీ*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 22,
జనం సాక్షి :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో దొంగల భీభత్సం..
జాతీయ రహదారిపై సాయి కృష్ణ టాకీస్ సమీపంలో పన్నెండు దుకాణాలలో చోరీ
సుమారుగా పది లక్షల వరకు నగదు చోరీ గత కొద్దిరోజులుగా మెట్ పల్లి పట్టణంలో వరుస దొంగతనాలతో ఆందోళనలో మెట్ పల్లి వాసులు పట్టణంలోని జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న పన్నెండు దుకాణాల్లో వరుసగా దొంగతనం జరిగి బెంబేలెత్తుతున్న పట్టణవాసులు, దొంగతనం జరిగిన దుకాణదారులు.అనిల్ ఐరన్ హార్డ్వేర్, వెంకటేశ్వర ట్రేడర్, అగ్రోస్ రైతు సేవ కేంద్రం, కనక సోమేశ్వర కిరణం, పద్మాలయ ఎలక్ట్రానిక్, కావ్య శ్రీ మెడికల్, వాసవి మొబైల్ పాయింట్, మెయిన్ బాక్స్ డ్రెస్సెస్, నాగేంద్ర మెడికల్, వరలక్ష్మి ఫర్టిలైజర్ తదితర దుకాణాల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా దుకాణ యజమానులు మాట్లాడుతూ రాత్రి పూట పోలీసులు పెట్రోలింగ్ పగడ్బందీగా నిర్వహించాలని అలాగే పోలీస్ రక్షణ వ్యవస్థ బాగా పని చేయాలని, తొందరలో దొంగలను పట్టుకుని పోయిన డబ్బును రికవరీ చేసి మాకు న్యాయం జరపవలసిందిగా బాధితులు కోరారు
మెట్ పల్లి లో దొంగల బీభత్సం, పన్నెండు దుకాణాలలో చోరీ




