Tuesday, 3 November 2026

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానికులకు ఇవ్వాలి

*. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూన్ 26 :–. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ఏరియాల్లో, నియోజకవర్గ ప్రజల సొత్తు అయిన స్థానిక భూముల్లో నిర్మితమవుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నియోజకవర్గ వాసులకు, ఎక్కడికక్కడ స్థానికులకు కేటాయించకుండా వేరే ప్రాంతాల వారికి కేటాయిస్తుండడాన్ని నిరసిస్తూ టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఈరోజు జవహర్ నగర్ లో నిర్మాణం లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను పరిశీలించి , ప్రభుత్వానికి నిరసన తెలిపడం జరిగింది.
పరిశీలన అనంతరం హరి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ
,మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నియోజకవర్గ వాసులకే కేటాయించాలి,
హైదరాబాద్ నగరంలో విలువైన భూములను ప్రభుత్వం, వారి అనుచరులకు అప్పనంగా తక్కువ ధరకు అమ్ముకుంటుంది,
మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించి హైదరాబాద్ నగర వాసులకు కేటాయించడాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది,
నియోజకవర్గంలో అర్హులైన పేదలు ఎంతోమంది ఉన్నారు,
మా భూముల్లో నిర్మితమవుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను మాకే కేటాయించాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేయడం పట్ల అభ్యంతర ఏమిటని నిలదీశారు
ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న మంత్రి మల్లారెడ్డి,
నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్న మంత్రి మల్లారెడ్డి,
కేవలం 10 శాతం ఇళ్ళను మాత్రమే నియోజకవర్గ ప్రజలకు కేటాయిస్తామని మంత్రి మల్లారెడ్డి సిగ్గు లేకుండా చెప్పడం నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు
ఎంతోమంది స్థానిక పేదలు ఇళ్ళ కోసం దరఖాస్తు చేసి ఉన్నారని చెప్పుకొచ్చారు
నిర్మాణం పూర్తి అయిన ఇళ్ళను వెంటనే స్థానికులకు కేటాయించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమే గృహ ప్రవేశాలు చేసి స్థానికులకు అప్పచెబుతామని అన్నారు
మంత్రి మల్లారెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరగకుండా వెంటనే స్థానికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ స్థానికులకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు
మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు ఇంత అన్యాయం చేస్తున్న మంత్రి మల్లారెడ్డిని,బి ఆర్ యస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అద్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘణపురం గ్రామ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, జవహర్ నగర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరిశెట్టి కిరణ్ కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బద్దినేని అనంతలక్ష్మి, ఎస్సీ సెల్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ గండి సునీత, ఉపాధ్యక్షులు దేవేందర్ రెడ్డి ,మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్వేల్ శంకర్, నర్సింగ్, మహిళా నాయకురాళ్ళు చింత విజయ, రేసు లక్ష్మి, జోగి సునీత, సరిత, జయమ్మ, సరిత ,కుమార్, కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు