Tuesday, 3 November 2026

పాల సొసైటీ సంఘం చైర్మన్ గా జీవిలికపల్లి శ్రీనివాస్.

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్ జూన్ 26

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన పాల సొసైటీ ఎన్నికల్లో చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జీవిలికపల్లి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తనపై నమ్మకం ఉంచి సొసైటీ చైర్మన్ గా ఎన్నుకుంన్నందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. సొసైటీ అభివృద్ధి కోసం, పాడి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతానని శ్రీనివాస్ తెలిపారు.ఈ చైర్మన్ ఎన్నికకు ముందు బోయిని పుష్పలత,బోయిని శ్రీను(కుమార్) ఇద్దరు నూతన డైరెక్టర్ లు ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో గంగాధరి నర్సిములు, ఆకుల నితీష్, పసుల కొమురమ్మ, బోయిని చంద్రయ్య, పసుల నర్సిములు, ముట్రాజ్ పల్లి చంద్రం, మహిపాల్ రెడ్డి, పసుల సత్యనారాయణ,బోయిని శ్రీహరి,తదితరులు పాల్గొన్నారు.