డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని బాధితుల ధర్నా తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 29 ::రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గ పరిధి తూప్రాన్ మున్సిపాలిటీ లో డబుల్ బెడ్ రూమ్ లు డ్రా పద్ధతిలో కేటాయించి పట్ట సర్టిఫికెట్ లు ఇవ్వడం లేదని తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు డబుల్ బెడ్రూంలో ప్రారంభోత్సవం చేసి డ్రా పద్ధతిలో ఇల్లు కేటాయించారని దీనిలో రాజకీయ నాయకుల ప్రమేయంతో అనేక అవకతవకులు జరిగాయని ఇండ్లున్న వారికి ఇండ్లు ఇండ్లు లేని వారికి ఇవ్వలేదంటూ ఆందోళన లు రావడంతో కేటాయింపును అధికారులు నిలిపివేశారు త్వరలో సమగ్ర విచారణ జరిపి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఆయన ఎంతవరకు ఎలాంటి ఇల్లు కేటాయించకపోవడంతో ఇల్లు లేని నిరుపేదలు తాసిల్దార్ కార్యాలయం ముందు రెండు గంటలు ధర్నా నిర్వహించారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో సౌకర్యాలు కల్పించాలని అసంపూర్తిగా నిర్మాణం అరకొర సౌకర్యాలు విద్యుత్. లేదు డ్రైనేజీ లెదు తాగు నీరు లేదు సీసీ రోడ్లు లేవు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించి రెండు నెలలు అయిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఆరోపించారు డ్రా పద్ధతిలో లో ఇల్లు కేటాయించిన మళ్ళీ మార్పులు చేస్తూ కేటాయించడాన్ని వ్యతిరేకంగా రోడ్డు ఎక్కిన లబ్ధిదారులు ఈ రోజు పట్టా సర్టిఫికేట్ లు ఇస్తామని చెప్పి ఇవ్వక పోవడంతో రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు పోలీసులు వచ్చిన కేసీఆర్ డౌన్ డౌన్ పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఇష్టం వచ్చిన వారికి కేటాయిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో ఇలా ఉందని వెంటనే డబ్బులు పెట్టుకుని కేటాయించాలని డిమాండ్ చేశారు. వారం రోజులలో పట్టా సర్టిఫికెట్ లు ఇస్తామని తహసీల్దార్ జ్ఞాన జ్యోతి హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని బాధితుల ధర్నా తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 29 ::రాష్ట్ర ముఖ్యమంత్రి




