విద్యార్థులకు టైలు బెల్టుల బహుకరణ….
చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- మండలంలోని గంగారం ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న 55 మంది విద్యార్థులకు గ్రామానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సులిగె సతీష్ వారి పాప పుట్టినరోజు సందర్బంగా విద్యార్థులకు టైలు,బెల్టులు తనవంతు సహాయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విశాల ఉపాధ్యాయులు మౌనిక పంచాయతీ కార్యదర్శి అశోక్ ,గ్రామస్తులు బాబు, శివరాజు,బిక్షపతి,లాజర్ తదితరులు పాల్గొన్ని,విద్యార్థులకు సతీష్ టైలు,బెల్టులు అందించడం చాల సంతోషమని వారు అభినందించారు..




