Tuesday, 3 November 2026

దినసరి ఉద్యోగుల నిరసన సమ్మె

దినసరి ఉద్యోగుల నిరసన సమ్మె
– సమాన పనికి సమాన వేతనం సకాలంలో ఇవ్వాలి

అశ్వరావుపేట ఆర్ సి,అక్టోబర్ 29 (జనం సాక్షి ) సమాన పనికి సమాన వేతనం సకాలంలో చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ హాస్టల్లో, పాఠశాలలో దినసరి వర్కర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నియోజకవర్గ దమ్మపేట మండలంలోని అంకంపాలెం లో ఆశ్రమ గిరిజన పాఠశాల ముందు దినసరి వర్కర్లు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వారికి టైమింగ్ స్కేలు ఇస్తూ 30% పిఆర్సి కలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ హాస్టల్స్ మరియు ఆశ్రమపాఠశాలలో పనిచేస్తున్న వర్కర్లను క్రమబద్ధీకరించాలని అన్నారు. స్త్రీలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని, సెలవులతో పాటు వేతనాలు కూడా చెల్లించాలన్నారు. గత సంవత్సరం 2020 లాక్ డౌన్ సమయంలో రావలసిన ఆరు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోకారం సుబ్బారావు, సంఘాల బుచ్చయ్య, పెనుబల్లి రత్తమ్మ, కుంజా సుశీల, ఇర్ఫా నాగమణి, వాగ్గేల కాంతమ్మ, ఓకే శాంతమ్మ, కంగాల శాంత, తదితరులు పాల్గొన్నారు.