జనం సాక్షి దుబ్బాకసికింద్రాబాద్, మే 30 : లాలాపేట లోని సాయి నగర్ లో చేపడుతున్న డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలనీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అయన లాలాపేట సాయి నగర్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో చోటుచేసుకున్న జాప్యం నెలకొందని అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ సెల్ అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాలాపేట లో రూ.6 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ పనులను, రూ.6.99 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం పనులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యతను పాటించాలని, వేలినంత త్వరలో పనులు పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు.




