జనంసాక్షి, మంథని : మంథని మున్సిపాలిటీ మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు పోతరవేని క్రాంతి ని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సన్మానించడం జరిగింది. తదనంతరం మత్స్యశాఖ అభివృద్ధిలో మంథని ప్రాంతానికి సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలైన అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారని ముదిరాజుల అభివృద్ధి కోసం ఐక్యత కోసం పాటుపడే యువ నాయకులు ఇంకా ముందుకు వచ్చి ఐక్యతను చాటాలని పలు సూచనలు చేశారు. మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మంథని లో ఉన్న ముదిరాజ్ సోదరుల ఐక్యతను చాటి చెప్పిందని అన్నారు.
మంథని మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు పోతరవేని క్రాంతిని సన్మానించిన ఈటెల రాజేందర్




